LYRIC

Silaka 2 Lyrics by Folk Song

Singers: Laxmi
Music: Ramesh
Lyrics: Still Vijay

Silaka 2 Lyrics In English

Female: Sirimalle Thotallo Sinnanga Pothunte
Silako Naa Rama Silaka
Vaani Sirunavvu Choosaka
Naa Sinni Gundello Molisindile Prema Molaka

Female:  Marumalle Thotallo GiraGira Thirigeti
Silako Naa Rama Silaka
Vaadu Arakora Soopulatho Ardhame Kaadamma
Silako Naa Rama Silaka

Female: Silako Naa Rama Silako
Vaani Soopullo Matthundhi Ganako
Aa Matthullo Padi Nenu Sitthaipoyaanu

Female: Sirimalle Thotalla, Aaha
Sirimalle Thotalla Sinnanga Pothunte
Silako Naa Rama Silaka
Vaani Sirunavvu Choosaka
Naa Sinni Gundello Molisindile Prema Molaka

Silaka 2 Lyrics In Telugu

సిరిమల్లె తోటల్లొ సిన్నంగ పోతుంటే
సిలకో నా రామ సిలక
వాని సిరునవ్వు చూసాక
నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక

ఆమె: మరుమల్లె తోటల్లో గిరగిర తిరిగేటి
సిలకో నా రామ సిలక
వాడు అరకొర సూపులతో అర్ధమే కాడమ్మ
సిలకో నా రామ సిలక

ఆమె: సిలకో నా రామ సిలకో
వాని సూపుల్లో మత్తుంది గనకో
ఆ మత్తుల్లో పడి నేను సిత్తైపోయాను

ఆమె: సిరిమల్లె తోటల్ల, ఆహా
సిరిమల్లె తోటల్ల సిన్నంగ పోతుంటే
సిలకో నా రామ సిలక
వాని సిరునవ్వు చూసాక
నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక

ఆమె: మందార పువ్వుల్లో మకరందమోలున్న
సిలకో నా రామ సిలక
నా అందచందాలన్న ఆరగించడేమో
సిలకో నా రామ సిలక

ఆమె: సందెకాడ పూసే సింధూర పువ్వులు
సిలకో నా రామ సిలక
నుదుట సింధూరమై వాడు రానన్న రాడేమే
సిలకో నా రామ సిలక

ఆమె: సిలకో నా రామ సిలకో
వాడు సిన్నోడు కాదమ్మ సిలకో
నా సన్నాని నడుముళ్ళ
సన్నాయిలూదాడు
సిరిమల్లె తోటల్ల, ఆహా

ఆమె: కనకాంబరం లాంటి కన్నె పిల్లను నేను
సిలకో నా రామసిలక
నన్ను కళ్యాణమాడగ వరుడై రాడేమె
సిలకో నా రామసిలక

ఆమె: చామంతి పువ్వంటి ఛాయ కల్గిందాన్ని
సిలకో నా రామ సిలక
నాకు సీమంతమయ్యేటి భాగ్యమన్నియ్యడే
సిలకో నా రామ సిలక

ఆమె: సిలకో నా రామ సిలకో
వాడు నడకల్లో నటరాజు గనకో
వాని అడుగుల్లో అడుగేసి
కడదాక తోడుంట

ఆమె: సిరిమల్లె తోటల్ల, అర్రె
సిరిమల్లె తోటల్ల సిన్నంగ పోతుంటే
సిలకో నా రామ సిలక
వాని సిరునవ్వు చూసాక
నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక

ఆమె: ఆ, అల్లిపూల నడుమ మెల్లంగ పోతుంటే
సిలకో నా రామసిలక
వాన్ని అల్లుకుందామంటే ఎల్లిపోయినాడమ్మ
సిలకో నా రామ సిలక

ఆమె: నల్లగున్నగాని నా బావ మంచోడు
సిలకో నా రామ సిలక
నల్లపూసలు అల్లి మెళ్ళో ఏస్తున్నాడు
సిలకో నా రామ సిలక
నల్లపూసలు అల్లి మెళ్ళో ఏస్తున్నాడు
సిలకో నా రామ సిలక
నల్లపూసలు అల్లి మెళ్ళో ఏస్తున్నాడు
సిలకో నా రామ సిలక, ఆహా

సిలకో నా రామ సిలక 2 Song

Music Lable: VR Talkies

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO