LYRIC

Addedu Addedu 2 Lyrics by Thirupathi Matla, Sung by Madhupriya, From Folk Song Telugu In English తెలంగాణ పాట. అడ్డెడు అడ్డెడు అల్లిపూలు.

Addedu Addedu 2 Lyrics

అడ్డెడు అడ్డెడు అల్లిపూలు Lyrics

కోరస్: ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన
ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన

ఆమె: అడ్డెడు అడ్డెడు అల్లీపూలు
అత్తా మామలు సారె పోయంగా
అత్తా మామలు సారె పోయంగా
తవ్వెడు తవ్వెడు తాలీపూలు
తల్లీదండ్రులు సారె పోయంగా
తల్లీదండ్రులు సారె పోయంగా

ఆమె: ఎసో ఎసో ఎసోదాల మేనత్తకొడుకో
ఏలువట్టి కోలు తిరుగుదామా
నా ముత్యాల కొడుకో

కోరస్: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

ఆమె: అహ, తెల్లాజీర తెల్లా రైక
తెల్లారంగ గట్టుకొని
మాడబిళ్ళ నేను వెట్టుకొని
సెవులకు కమ్మలు
సేతికి గాజులు సింగారంగ వెట్టుకొని
నేను సిక్కులు సేత వట్టుకొని

ఆమె: ముసిముసిగా నవ్వుకుంటు
ముస్తాబై వస్తుంటే
సిగ్గులమొగ్గ నీ అందం
సూడ సక్కదనమన్నాడే

ఆమె: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

కోరస్: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

ఆమె: జిలకర బెల్లం కలిపి
నెత్తీమీద వెట్టంగా
నా మెత్తని కాళ్ళు తొక్కంగా
నా సెయ్ నీ సేతుల వెట్టి
తోడునీడగుందామా అని
కన్యాదానం సెయ్యంగా

ఆమె: కలకాలం కలిసుండాలని
తలంబ్రాలు పోయంగా
మేళాతాళాల నడుమ
మన మనువు గావాలా

ఆమె: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

కోరస్: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

ఆమె: ముత్యాలపందిరి కింద
సుట్టాలందరు సూడంగ
మన ఇద్దరి పెండ్లి జరగంగా
దేవాన దేవుళ్ళందరు మన దిక్కు సూడంగ
నా మెడలో పుస్తె కట్టంగా

ఆమె: బతుకంతా పచ్చగ ఉండాలని
పసుపు బియ్యము పొయ్యంగా
పంచభూతాల సాక్షిగా
మనమిద్దరమొక్కటి గావాలా

ఆమె: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

కోరస్: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

ఆమె: నన్నుగన్న నా అయ్యవ్వనిడిసి
అత్తారింటికి జేరంగా
నా అప్పగింతలు సెయ్యంగా
పుట్టీనింటినిడిసిపెట్టి మెట్టీనింటి గడపలోన
కుడికాలు మోపంగా

ఆమె: తోడీకోడండ్ల నడుమ
నట్టింట్లో తిరగంగా
ఇంటికి సిన్నా కోడలినాని
కంటికి రేప్పొలే సూడాలా

ఆమె: డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

కోరస్: ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన
ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO