LYRIC

Thalli Naa Velishala Lyrics by Mittapalli Surender, Music by Bharath Kumar Mekala, Singer by Patamma Rambabu, Jupaka Siva & Others, From Telangana Folk Song. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా…

Thalli Naa Velishala Lyrics

Thalli Naa Velishala Lyrics

తల్లి నా వెలిశాల Lyrics

అతడు:  తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాల
కోరస్: తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాల

అతడు: నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు
నెత్తురోసుకున్న నేలా
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు: తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో
దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు
కోరస్: దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు
ఉయ్యాలలూపావు జంపాలలూపావు
ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు
కోరస్: ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు
ఎండిన ఆకుల ఎన్నుపూసల నుండి
ఆయుధాలు దీసి పోరాడమన్నావు

కోరస్: తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు: పడమటి కొండల్లో వాలేటి పొద్దును
వేలెత్తి చూపావు ఉదయించమన్నావు
కోరస్: వేలెత్తి చూపావు ఉదయించమన్నావు
అతడు: అన్యాయమన్నది ఎదిరించమన్నావు
న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
కోరస్: న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు

అతడు: దీనుల కళ్ళల్లో పేదోల్ల ఇళ్లల్ల
దీపాలు మీరైనా సాలు బిడ్డన్నావు
కోరస్: తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు: పచ్చని పైరుల్లో వెచ్చాని నెత్తురు
చిల్లినా నీ కంట్లో కన్నీరు దాచావు
కోరస్: చిల్లినా నీ కంట్లో కన్నీరు దాచావు
అఅతడు:  తడు: తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి
పోరులో త్యాగాలు తొలి మెట్టు అన్నావు
కోరస్: పోరులో త్యాగాలు తొలి మెట్టు అన్నావు

అతడు: తెలుసుకోమన్నావు తలుసుకోమన్నావు
పేదోల్ల రాజ్యాన్ని సాధించమన్నావు
కోరస్: తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు: దేశాన్ని కాపాడే సైనిక బిడ్డలా
బతుకుదెరువు లేక బాడరుకు పంపావు
కోరస్: బతుకుదెరువు లేక బాడరుకు పంపావు
అతడు: అరచేత పెంచావు ఆయుధాన్నిచ్ఛావు
సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు
కోరస్: సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు

అతడు: శత్రువులకేనాడు తలవంచకన్నావు
కన్నందుకు తలవంపు తేకన్నావు
కోరస్: తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు:  యే గూనాన గూనానరే
గూననారే గూనాన గూనానరే
గూనాన గూనానరే
గూననారే గూనాన గూనానరే

అతడు: త్యాగాల కాగితం మన నేల సంతకం
నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు
కోరస్:  నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు
ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు
రాజకీయాలను కూలదొయ్ మన్నావు
కోరస్:  రాజకీయాలను కూలదొయ్ మన్నావు

అతడు: ఎర్రజెండానెత్తి దొరల గుండెపైన
దండుగా దండిగా దాడి చేయమన్నావు
తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు: నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు
నెత్తురోసుకున్న నేలా
తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

అతడు: ఓ గూనాన గూనానరే
గూననారే గూనాన గూనానరే
కోరస్:  తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా
తల్లి నా వెలిశాలా

తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా Song Lyrics

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO