LYRIC

O Nagadarilo Bathukamma Lyrics are written by Dilip Devgan, and sung by Madhuppriya, while Naveen J have made its tune,అల్లి పువ్వులు పూసినయి. అందాల రాశులు పోసినయి బంతిపూలు బావలు కోసినరో. from Madhu Priya Bathukamma, Songs.

O Nagadarilo Bathukamma Lyrics In English

Female: Alli Puvvulu Poosinayi
Andala Raasulu Posinayi
Bathipoolu Baavalu Kosinaro
Sinna Pedda Sindhulu Vesinaro
Chorus: Sinna Pedda Sindhulu Vesinaro

O Nagadarilo Bathukamma Lyrics In Telugu

Female: అల్లి పువ్వులు పూసినయి
అందాల రాశులు పోసినయి
బంతిపూలు బావలు కోసినరో
సిన్న పెద్ద సిందులు వేసినరో
Chorus: సిన్న పెద్ద సిందులు వేసినరో

Female: అల్లి పువ్వులు పూసినయి
అందాల రాశులు పోసినయి
బంతిపూలు బావలు కోసినరో
సిన్న పెద్ద సిందులు వేసినరో
Chorus: సిన్న పెద్ద సిందులు వేసినరో
Female: రామ రామ రామ ఉయ్యాలో
రామునే శ్రీరామ ఉయ్యాల
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరానే ఉయ్యాల

Female: నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాల
బామలంతా కూడి ఉయ్యాలో
బతుకమ్మ పేర్చిరి ఉయ్యాల
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నేల వన్నెకాడ ఉయ్యాల

Female: పాపిట్ల సెంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాల
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తరామాస టెన్ టు ఫైవ్ ఉయ్యాల
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాల
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాల

Female: ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో

Female: ఆకిలి అలుకుసల్లే గుమ్మడి గుండే సేరే
బంతిపువ్వు బైలెల్లే బతుకమ్మలు అల్లుకునే
మా తల్లి గౌరమ్మా మా ఇంటా కొలువుదీరే
ఓ నగా, అరెరె టెన్ టు ఫైవ్ ఆ నగా

Female: ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో

Female: తంగేడు పువ్వు వనములో సిన్నదాని నవ్వులో
ఊరంతా జాతరా పువ్వుల పండుగో
డప్పుళ్ళ సప్పుల్ల గజ్జె మోతరో

 బంగరు బొడ్డెమ్మరో బంతిపూలు అల్లెరో
అక్కా సెల్లెల్లా ఆట సూడరో
ఉయ్యాల పాటలే పాడుతున్నరో

Female: సద్దుల బతుకమ్మ సల్లగ మము సూడమ్మా
ఎంగిలి బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ
మా తల్లి గౌరమ్మా మా ఇంట కొలువుదీరే
ఓ నగా, అరెరె ఆ నగా

Female: ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో

Chorus: రేలా రేల, రెల రేలా రేలా
రేలా రేల, రెల రేలా రేలా
రేలా రేలా రే రేలా రేలా

Female: ఓ రాగమెత్తే దారిలో రామ నిత్తె దారిలో
బంగారు బతుకమ్మ బైలెల్లెనో
గంగమ్మ సేరే దారి బామలెత్తెనో
ఏలేలు మాతల్లి మా పల్లెల వాడలో
సిత్తూల బతుకమ్మ పండగాయెరో
పచ్చాని పైరులు పరవసించెరో

Female: ఆటల్లా పాటల్లా బతుకమ్మా బైలెల్లే
ఊరంతా కదిలెల్లే గంగమ్మను సేరుకునే
మా తల్లి బతుకమ్మ మా సద్దుల బతుకమ్మ
ఓ నగా, అరెరె ఆ నగా

Female:ఓ నగదారిలో ఆ నగదారిలో
రంగుల పువ్వులే రమ్మన్నాయో
సద్దుల బతుకమ్మను సేయమన్నయో
నాగమల్లే దారిలో నేనెల్లే దారిలో
బావల కొంగుల్లో బంతిపువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో
సేతుల్లో సిక్కెనే గునుగు పువ్వులో

ఓ నగదారిలో Bathukamma Info

Lyrics Dilip Devgan
Singer Madhuppriya
Music Naveen J
Song Lable

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO