LYRIC

Iddaru Akka Chellelu Song Lyrics by Mrs. Chokhalla Danalakshmi, From బతుకమ్మ సాంగ్ ఇద్దరు అక్క చెల్లెల్లు ఉయ్యాలో ఒక్క ఊరికి ఇచ్చే ఉయ్యాలో.

Iddaru Akka Chellelu Song Lyrics

Iddaru Akka Chellelu Uyyalo
Okka Ooriki Ichhe Uyyalo
Okkade Maayamma Uyyaalo
Vachhanna Podu Uyyaallo

Etlotthu Chellelaa Uyyaalo
Eraddamaaye Uyyalo
Eruku Emapallu Uyyalo
Thalupuladdamaaye Uyyalo
Thalupulaku Thaalaalu Uyyalo
Vendi Seelaalu Uyyalo
Vendi Seelaala Kinda Uyyalo
Velapatthi Chettu Uyyalo
Velapatthi Chettuku Uyyalo
Ede Ginjalu Uyyalo

Edu Ginjala Patth Uyyaalo
Thakkedu Patthi Uyyalo
Aa Patthi Ee Patthi Uyyalo
Thakkedu Patthi Uyyalo
Paala Paala Patthi Uyyalo
Paavuraala Patthi Uyyalo
Musaldi Vadikindi Uyyalo
Muthyala Patthi Uyyalo

ఇద్దరక్క చెల్లెల్లు ఉయ్యాలో Lyrics

ఇద్దరు అక్క చెల్లెల్లు ఉయ్యాలో
ఒక్క ఊరికి ఇచ్చే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
వచ్చన్న పోడు ఉయ్యాలో

ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయే ఉయ్యాలో
ఏరుకు ఎంపళ్ళు ఉయ్యాలో
తలుపులడ్డామాయే ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండి సీలాలు ఉయ్యాలో
వెండి సీలలా కింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకు ఉయ్యాలో
ఏడే గింజలు ఉయ్యాలో

ఏడు గింజల పత్తి ఉయ్యాలో
తక్కేడు పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
తక్కేడు పత్తి ఉయ్యాలో
పాల పాల పత్తి ఉయ్యాలో
పావురాల పత్తి ఉయ్యాలో

ముసల్ది వడికింది ఉయ్యాలో
ముత్యాల పత్తి ఉయ్యాలో
వయసమ్మ వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో
చిన్నారి వడికింది ఉయ్యాలో
చిన్నెల పత్తి ఉయ్యాలో
బాలింత వడికింది ఉయ్యాలో
బంగారు పత్తి ఉయ్యాలో

ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలోనికి ఇచ్చెనే ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో
సాగదియ్యబట్టే ఉయ్యాలో
నేసెనమ్మా సాలోడు ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో

దిగేనమ్మా ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్టుక ఉయ్యాలో
కొంగళ్ల బాయికి ఉయ్యాలో
కొంగళ్ల బాయికి ఉయ్యాలో
నీళ్లకెళ్లినది ఉయ్యాలో
కొంగళ్ళన్నీ గూడి ఉయ్యాలో
కొంగు అంత చింపెను ఉయ్యాలో

ఆ చీర కట్టుక ఉయ్యాలో
హంసల్ల బావికి ఉయ్యాలో
హంసల్ల బావికి ఉయ్యాలో
నీళ్లకెళ్లినాది ఉయ్యాలో
హంసలన్నీ గూడి ఉయ్యాలో
అంచంత దూసెను ఉయ్యాలో

ఆ చీర కట్టుక ఉయ్యాలో
చిలకల్ల బావికి ఉయ్యాలో
చిలకల్ల బావికి ఉయ్యాలో
నీళ్లకెళ్లినాది ఉయ్యాలో
చిలకలన్నీ గూడి ఉయ్యాలో
చింగులన్నీ చింపే ఉయ్యాలో

ఆ చీర కట్టుక ఉయ్యాలో
పట్నంబు బాయెనే ఉయ్యాలో
పట్నంబు బాయెనే ఉయ్యాలో
కొంగు బంగారమే ఉయ్యాలో
దిగెనమ్మా ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో

అన్నరా ఓయన్న ఉయ్యాలో
అన్నరా పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికి ఓసారి ఉయ్యాలో
బతుకమ్మ పండగ ఉయ్యాలో
ఆడపిల్లని అన్న ఉయ్యాలో
మరువకు ఓయన్న ఉయ్యాలో

కల్గెనే పెద్దన్న ఉయ్యాలో
కన్న తల్లివోలె ఉయ్యాలో
ఏడంత్రాలదే ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులెన్నో తెచ్చి ఉయ్యాలో
వారిద్దరున్నరా ఉయ్యాలో
వీరిద్దరున్నరా ఉయ్యాలో
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లి ఉయ్యాలో

తంగేడు పువ్వులు ఉయ్యాలో
రాశిగా తెప్పించి ఉయ్యాలో
ఏడంత్రాలనే ఉయ్యాలో
బతుకమ్మనే చేసి ఉయ్యాలో
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
పోయిరావమ్మ ఉయ్యాలో
మల్లేడాదికి ఉయ్యాలో
మళ్ళీరావమ్మా ఉయ్యాలో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO