LYRIC

Ooriki Utharana Valalo Lyrics by Bathukamma Telugu Song. Music by T Prabhakar, Sung by Telu Vijaya, From తెలంగాణ బతుకమ్మ పండుగ పాట. ఊరికి ఉత్తరానా… వలలో. ఊడాలా మర్రీ… వలలో.

Ooriki Utharana Valalo Lyrics

ఊరికి ఉత్తరానా వలలో. ఊడాలా మర్రీ వలలో Lyrics

ఊరికి ఉత్తరానా… వలలో
ఊడాలా మర్రీ… వలలో
ఊడల మర్రి కిందా… వలలో
ఉత్తముడీ చవికే… వలలో
ఉత్తముని చవికేలో… వలలో
రత్నాల పందీరీ… వలలో
రత్తాల పందిట్లో… వలలో
ముత్యాలా కొలిమీ… వలలో

గిద్దెడు ముత్యాలా… వలలో
గిలకాలా కొలిమీ… వలలో
అరసోల ముత్యాలా… వలలో
అమరీనా కొలిమీ… వలలో
సోలెడు ముత్యాలా… వలలో
చోద్యంపూ కొలిమీ… వలలో
తూమెడు ముత్యాలా… వలలో
తూగేనే కొలిమీ… వలలో
చద్దన్నమూ తీనీ… వలలో
సాగించూ కొలిమీ… వలలో
పాలన్నము దీనీ… వలలో
పట్టేనే కొలిమీ… వలలో

ఉదెటి తిత్తూలు… వలలో
ఉరుమూల పోలు… వలలో
మేసేటి సమ్మెట్లు… వలలో
పిడుగూల పోలు… వలలో

లేచేటి రవ్వళ్ళు… వలలో
మెరుపూల పోలు… వలలో
చుట్టున్న కాపూల… వలలో
ఉక్కాల పోలు… వలలో

నడుమాత మరి బిడ్డా… వలలో
చంద్రున్ని పోలు… వలలో
నీరోసి గొడ్డళ్లూ… వలలో
నునుపు లెక్కించి… వలలో

పొయిరే అన్నలూ… వలలో
అడవీ మార్గాన… వలలో
పోయేటి అన్నలకు… వలలో
ఏమేమి సద్దీ… వలలో
అడవి చిక్కుడుకాయ… వలలో
అలసందా పప్పూ… వలలో
పచ్చజొన్న అన్నంబూ… వలలో
వెయ్యావుల పెరుగూ… వలలో

పొయిరే అన్నలూ… వలలో
అడవీ మార్గాన… వలలో
మూడామడలు బోయీ… వలలో
ములకాల బొట్టీ… వలలో
నాల్గామడలు బోయీ… వలలో
నాగల్లూ గొట్టీ… వలలో
కొట్టిన సామానూ… వలలో
బండ్లాకెత్తారూ… వలలో

ముత్యాల కొలిమి కాడా… వలలో
నిలిపీరి బండి… వలలో
తెచ్చిన సామానూ… వలలో
దించీరా వీధి… వలలో
చేసిరి నాగల్లూ… వలలో
చేను దున్నంగా… వలలో
కోసిరి గొర్రులకూ… వలలో
కొండ్రా దున్నంగా… వలలో

దండాలు పగ్గాలు… వలలో
దబ్బూన లాగీ… వలలో
దూలాలపై గొర్లూ… వలలో
ధుమ్మూ దులిపేరూ… వలలో
మేసేరు పోటేర్లు… వలలో
ఇత్తూలెయ్యంగా… వలలో
తూర్పున ఒక వానా… వలలో
తుమ్మెదలా మోతా… వలలో
పడమట ఒక వానా… వలలో
పట్టీ కురువంగా… వలలో
ఈ వాన ఆ వానా… వలలో
ఏకా జడివానా… వలలో
మెదిలి చేనూకూ… వలలో
ఎదవానాలాయే… వలలో

శ్రీ రాముడు గొర్రువట్టూ… వలలో
సీతా ఎద వెట్టూ… వలలో
సీత వెట్టిన ఏదా… వలలో
శ్రీముత్యములు పండూ… వలలో

గది రాముడు గొర్రువట్టూ… వలలో
రంభా ఎద వెట్టూ… వలలో
రంభ బెట్టిన ఏదా… వలలో
రాజనాలు పండూ… వలలో

రాగి తుముల కిందా… వలలో
రతనాలు పండూ… వలలో
నిండిపిడి కొడవల్లూ… వలలో
వేయి వేలు జేసూ… వలలో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO