నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్ల Lyrics
అతడు: తెల తెల్లవారంగ తెల్లవారంగా
తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా
ఆమె: నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్ల
నల్ల సాయలు పిలగా రారా కన్నయ్య
అతడు: ఓ ఓ బుజ్జి నీ మనసే
ముద్దు మాటల మూట సద్ది
ఆమె: ఓ ఓ ఓ కన్నా నిన్ను జూత్తె
కరిగిపోయె వెన్నా
అతడు: కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
ఆమె: దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
అతడు: నింగి నేల సాక్షి నిప్పు నీరు సాక్షి
గాలిపటమోలే ఎగిరిపోదామా
ఆమె: నువ్వు నేను గూడి గువ్వగోరింకాయి
ప్రకృతమ్మ ఒడిలో సేదదీరుదామా
అతడు: నీ మాట పలికే కోయిలమ్మా
ప్రేమ కురిపించే చల్లని జాబిలమ్మా
ఆమె: నీ గుణము మచ్చ సల్లకుండా
నీ చెలిమి బంగారుకొండా
అతడు: కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
ఆమె: దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
అతడు: ఊడుగు సెట్టుకు ఉయ్యాల గట్టి
ఊపనా రత్తాల సారంగీ
ఆమె: ఊపర ఉయ్యాల నా నిదురపుచ్చగా
రావయ్య బంగారుసామి
అతడు: నిండు పున్నమోలే నీ మోము
మెరువవట్టె ఎంత సక్కదనమూ
ఆమె: పండు వెన్నెల్ల తీరు నీ నవ్వు
అయ్యో వెలుగుతాందిరో ఈ జాము
అతడు: కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
ఆమె: దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
అతడు: ఇంద్రధనస్సు తెచ్చి నింగి నక్షత్రాల
రంగవల్లి సీర నీకు కట్టనా
ఆమె: చంద్రవంక తిలకం నీకు నుదుటవెట్టి
ఇంద్రలోకానికే రాజు సెయ్యనా
అతడు: గా గలగల పారేటి గోదారి
మనకు సూపబట్టె మనువు రహదారి
ఆమె: గా కిలకిల పలికేటి పక్షులు
వేస్తున్నాయి అక్షింతలు
అతడు: కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
ఆమె: దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
అతడు: తెల తెల్లవారంగ తెల్లవారంగా
తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా
ఆమె: నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్ల
నల్ల సాయలు పిలగా రారా కన్నయ్య
Comments are off this post