LYRIC

Ededu Dappulla Bonam Paata Lyrics by Shankar Poddupodupu, Music by Kalyan Keys, Sung by Dasa Laxmi, From Latest Folk Song. ఏడేడు డప్పులు బోనాల పాట.

Ededu Dappulla Bonam Paata Lyrics

ఏడేడు డప్పులు బోనాల పాట Lyrics

ఆమె: ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల
ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

ఆమె: పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ
కోరస్: పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

ఆమె: ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల
అగ్గిదేవుడుదెరు గుగ్గీలమెదురు గుగ్గలమెదురు
నాగుంబాములెదురు నడికట్టు ఎదురు నడికట్టు ఎదురు

ఆమె: యాపాకొమ్మాలెదురు దీపాలు ఎదురు దీపాలు ఎదురు
కోడీపుంజులెదురు యాటళ్లు ఎదురు యాటళ్లు ఎదురు అహా..

చల్…​ చల్​
ఆమె: ఇందూరు ఎల్లమ్మ పొదిరెడ్డి పోశమ్మ
జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ

కోరస్: ఇందూరు ఎల్లమ్మ పొదిరెడ్డి పోశమ్మ
జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ

ఆమె: తల్లీ ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మహంకాళి
దయగల్ల సూపువే ఓరుగల్లు భద్రకాళి
కోరస్: ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మహంకాళి
దయగల్ల సూపువే ఓరుగల్లు భద్రకాళి

ఆమె: ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల…

ఆమె: ఆషాడమాసాన బోనాలు సురువు బోనాలు సురువు
ఆదివారం గోలే వేసేము దరువు వేసేము దరువు
గడపల్ల పోసేము కల్లు శాకాలు కల్లు శాకాలు
కాపాడ రావమ్మా ఎల్లా లోకాలు ఎల్ల లోకాలు

ఆమె: ఆ… ఆ… అత్తగిరి పోశమ్మ కట్కూరి ఎల్లమ్మ
గండిపేట మైసమ్మ గవ్వల దుర్గమ్మ
కోరస్: అత్తగిరి పోశమ్మ కట్కూరి ఎల్లమ్మ
గండిపేట మైసమ్మ గవ్వల దుర్గమ్మ

ఆమె: అమ్మా ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షీ
బాధలన్నీ బాపవే కంచిలోన కామాక్షీ
కోరస్: ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షీ
బాధలన్నీ బాపవే కంచిలోన కామాక్షీ

ఆమె: ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

ఆమె: పోతరాజులాట పొర్లు దండాలు పొర్లు దండాలు
అబ్బబ్బ అనిపించే ఊగే శిగాలు ఊగే శిగాలు
సిత్తముతో కట్టేము సికల దండాలు సికల దండాలు
నీముందు పెట్టేము సీరే సారేలు సీరే సారేలు

ఆమె: అగో అగో  గొలుకొండ ఎల్లమ్మా గోసలు తీర్చమ్మా
బంగరు మైసమ్మా రందులు బాపమ్మా
కోరస్: గోలుకొండ ఎల్లమ్మా గోసలు తీర్చమ్మా
బంగరు మైసమ్మా రందులు బాపమ్మా

ఆమె: తల్లీ నీ కండ్లల్ల మెరుపులే మావురాల ఎల్లమ్మా
బైండ్లోళ్ల కొలుపులే మా తల్లీ పెద్దమ్మ
కోరస్: నీ కండ్లల్ల మెరుపులే మావురాల ఎల్లమ్మా
బైండ్లోళ్ల కొలుపులే మా తల్లీ పెద్దమ్మ
ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

ఆమె: పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ
కోరస్: పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO