LYRIC

Radhamma Bangaru Bomma Part 2 Lyrics by Parvathi Mahesh, Music by Praveen Kaithoju, Sung by Boddu Dilip & Sanjana, From Telangana Folk Song. మల్లెమొగ్గలా తీరు. రాధమ్మ బంగారు బొమ్మ…

Radhamma Bangaru Bomma Part 2 Lyrics

Radhamma Bangaru Bomma Part 2 Lyrics

రాధమ్మ బంగారు బొమ్మ Lyrics

అతడు: మల్లెమొగ్గలా తీరు
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు గలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు గలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

అతడు: మనుసులు గలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనసార మనువాడుదామే
రాధమ్మ బంగారు బొమ్మ
మనువాడి ఒక్కటౌదామే
రాధమ్మ ఓ ముద్దుగుమ్మ

ఆమె: మనుసులు గలిసిన గాని
మహేషు వెయ్ మహరాజా
మనువాడ మా కష్టమయ్యో
మహేషు వెయ్ మహరాజా
మావోళ్లు ఒప్పుకోరయ్యో
మహేషు వెయ్ మహరాజా

ఆమె: మావోళ్లనొప్పిస్తనంటే
మహేషు వెయ్ మహరాజా
నీ యెంట నీనొస్తనయ్యో
మహేషు వెయ్ మహరాజా
మనువాడి కలిసుందమయ్యో
మహేషు వెయ్ మహరాజా

అతడు: ఓ పిల్లా…!!
అల్లి పువ్వుల తీరు
రాధమ్మ బంగారు బొమ్మ…
అల్లుకున్న బందమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
అల్లుకున్న బందమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

అతడు: అల్లుకున్న బందమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
అలిగలిగి నువ్వెళ్ళమాకే
రాధమ్మ బంగారు బొమ్మ
ఆగునమ్మో నాది గుండే
రాధమ్మ ఓ ముద్దుగుమ్మ

ఆమె: నేనలిగలిగి వెళ్ళిపోయినా
మహేషు వెయ్ మహరాజా
ఆగునయ్యో నాది గుండె
మహేషు వెయ్ మహరాజా
ఆగునయ్యో నాది గుండె
మహేషు వెయ్ మహరాజా

ఆమె: అలకలు ఆరనిమిషమయ్యో
మహేషు వెయ్ మహరాజా
అణువణువు నీ ప్రేమనయ్యో
మహేషు వెయ్ మహరాజా
అట్టెట్ల నిన్నిడ్దున్నయ్యో
మహేషు వెయ్ మహరాజా

అతడు: మరిగిన ముత్యానివమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు నీకెందుకమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు నువ్వాపవమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

అతడు: కన్నీరు ఇక మానవమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నోళ్లనొప్పిస్తనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కల్యాణమాడుతనమ్మో
రాధమ్మ ఓ ముద్దుగుమ్మ

ఆమె: ఆ ఎములాడ రాజన్న సూపు
మహేషు వెయ్ మహరాజా
ఎండికొండాలెక్కి కూసో
మహేషు వెయ్ మహరాజా
ఏలేటి మన ప్రేమవైపు
మహేషు వెయ్ మహరాజా

ఆమె: వచ్చేది మాఘమాసయ్యో
మహేషు వెయ్ మహరాజా
మంచి రోజు జూడవయ్యో
మహేషు వెయ్ మహరాజా
మావోళ్లనొప్పించవయ్యో
మహేషు వెయ్ మహరాజా

అతడు: ఓ పిల్లా, పార్వతోల్ల పిల్లగాన్నే
రాధమ్మ బంగారు బొమ్మ
పదిలంగా నీ ఇంటికొస్తా
రాధమ్మ బంగారు బొమ్మ
నీవోళ్లనొప్పిస్తనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

అతడు: నీవోళ్లనొప్పిస్తనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
పంతాలు మనకేలనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
పందిట్లో ఒక్కటౌదామే
రాధమ్మ నా ముద్దుగుమ్మ

ఆమె: ఆ మారుపాక పిల్లనయ్యో
మహేషు వెయ్ మహరాజా
మనసువడ్డ సిన్నదాన్నోయ్
మహేషు వెయ్ మహరాజా
మనసువడ్డ సిన్నదాన్నోయ్
మహేషు వెయ్ మహరాజా

ఆమె: మనసిస్తే మరువలేనయ్యో
మహేషు వెయ్ మహరాజా
మరణమైనా నిన్ను వీడ
మహేషు వెయ్ మహరాజా
మరణమైనా నిన్ను వీడ
మహేషు వెయ్ మహరాజా

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO