LYRIC
JAYA JAYA SUBHAKARA LYRICS Devullu Movie
Singers: S P Balasubramanyam
Music: Vandemataram Srinivas
Lyrics: Jonnavitthula
JAYA JAYA SUBHAKARA LYRICS In English
Male: Vakrathunda Mahaakaaya Koti Soorya Samaprabha
Nirvignam Kurumedeva Sarvakaaryeshu Sarvadhaa
Male: Jaya Jaya Shubhakara Vinaayaka
Shree Kaanipaaka Varasiddhi Vinaayaka
Jaya Jaya Shubhakara Vinaayaka
Shree Kaanipaaka Varasiddhi Vinaayaka
Aa Aa Aa Aa
JAYA JAYA SUBHAKARA LYRICS In Telugu
Male: వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
Male: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ
Male: బాహుదానదీ తీరములోన
బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావా
Male: ఇష్టమైనది వదలిన నీకడ
ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహాకృతి
Male: సకల చరాచర ప్రపంచమే
సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రామాణం
ధర్మ దేవతకు నిలపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం
కాణిపాకమున నీ దర్శనం
Male: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
Male: పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
Male: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ
జయ జయ శుభకర వినాయక Song Info
Singer | S.P.Balasubramanyam |
Music | Vandemataram Srinivas |
Lyrics | Jonnavitthula |
Star Cast | Prithvi, Raasi |
Song Label |
No comments yet