LYRIC
Maha Kanaka Durga Lyrics by Jonnavithula, sung by S Janaki, while Vandemataram Srinivas, has made its tune మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా Song, from Devullu Movie.
Maha Kanaka Durga Lyrics In English
Female: Maha Kanaka Durga… Vijaya Kanakadura
Parashakthi Lalitha… Shivananda Charitha
Maha Kanaka Durga… Vijaya Kanakadura
Parashakthi Lalitha… Shivananda Charitha
Female: Shivankari Shubhankari
Poorna Chandra Kalaadhari
Brahmma Vishnu Maheshwarula
Srushtinchina Moola Shakthi
Ashtaadasha Peethaalanu Adhishtinchu Aadishakthi
Maha Kanaka Durga Lyrics In Telugu
Female: మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
Female: శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి
Female: మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
Female: ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు… తపమును కావించెను
పరమశివుని మెప్పించి… పాశుపతం పొందెను
Female: విజయుడైన అర్జునుడి పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియూ జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిర నివాసము
Female: మేలిమి బంగారు ముద్ద పసుపు
కలగలిపిన వెన్నెల మోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
Female: అమ్మ మనసుపడి అడిగి ధరించిన
కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం
కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ
ఇదియే ముక్తి దీపం
Female: మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
Female: దేవీ నవరాత్రులలో… వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే… బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే… అన్నపూర్ణాదేవి
Female: లోకశాంతినీ సంరక్షించే
సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో
అవని జనుల కందించే
దివ్య రూపిణి మహాలక్ష్మి
Female: విద్యాకవన గాన మొసగు
వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు
ప్రసాదించు మహాదుర్గ
Female: శత్రు వినాసిని, శక్తి స్వరూపిని… మహిషాసురమర్దిని
విజయకారిణి, అభయ రూపిణి… శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం… దుర్గమ్మా నీ దర్శనం
Female: మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా… శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా Song Info
Singer | S Janaki |
Music | Vandemataram Srinivas |
Lyrics | Jonnavithula |
Star Cast | Prithvi, Raasi, SPB |
Song Label |
Comments are off this post