LYRIC

Ye Vaipuku Saguthondi Lyrics by Ramajogayya Sastry, Music by Radhan, Sung by Shankar Mahadevan, From Miss Shetty Mr Polishetty, Movie Song. ఏ వైపుకి సాగుతోంది ఆలోచనా…

Ye Vaipuku Saguthondi Lyrics

Male: Ye Vaipuki Saguthondi Aalochana
Yetuvaipo Nee Paadham Payaninchenaa
Kalagannaa Kaalamedho Sameepinchina
Inkaa Neelona Neeku Idhem Yaathanaa

Male: Nilakadagaa Nuv Neetho
Lenantu Alaa
Alajadiga Atu Ituga
Thadabadithe Elaa

Male: Nilakadagaa Nuv Neetho
Lenantu Alaa
Alajadiga Atu Ituga
Thadabadithe Elaa

ఏ వైపుకి సాగుతోంది ఆలోచనా Lyrics

అతడు: ఏ వైపుకి సాగుతోంది ఆలోచనా
ఎటువైపో నీ పాదం పయనించెనా
కలగన్నా కాలమేదో సమీపించినా
ఇంకా నీలోన నీకు ఇదేం యాతనా

అతడు: నిలకడగా నువ్ నీతో
లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా
తడబడితే ఎలా

అతడు: నిలకడగా నువ్ నీతో
లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా
తడబడితే ఎలా

అతడు: నీ తనువును ఆ బరువును
గమనించవే ఓసారి
ఎదురవ్వదా బదులివ్వదా
నువ్వు వెతికే రహదారీ

అతడు: ఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూ

అతడు: ఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూ

అతడు: ఏ నిజం నిజమని
ఎవ్వరో తేల్చరే ఏది నీ దారని
ఎవ్వరు చెప్పరే  నిన్నలు మొన్నలు
గడిచిన రోజులే రేపులు మాపులు
నీ అడుగుజాడలే

అతడు: ఎవరినో కాదనే తొత్తరాపాటులో
నిన్ను నువ్వే కాదనీ
ఏమారితే ఎలా? 

నిర్ణయం నీదనే పాత అలవాటులో
మనసనే మాటనీ గుర్తించవేంటలా

అతడు: ఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూ

అతడు: ఓ ఓ ఓ, ఏదో నిన్నాపుతోంది
నీలో నిన్నూ
ఏదో వెంటాడుతోంది
నీ పదాలను చెయ్యార అందుకొన్న కోరే కలను
నెమ్మదిగా ఉంచావేంటో నీ మనస్సును

అతడు: ఇది నువ్వా ఇది నువ్వా
నువు నువులా లేవే
నిను నువ్వే విననంటూ
గది మూసేసావే

అతడు: ఇది నువ్వా ఇది నువ్వా
నువు నువులా లేవే
నిను నువ్వే విననంటూ
గది మూసేసావే

అతడు: ఈ సోటునా, ఆ సోటునా
ఒక నీతో నువ్వేగా
నిను కుదిపిన ప్రతి ప్రశ్నకు
బదులైనా నీవేగా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO