LYRIC
Rangu Seethaammo Lyrics
Singer: Direction – Parshuram Nagam
Lyrics: Boddu Dilip – Lavanya
Rangu Seethaammo Lyrics In English
Rangu Seethaammo Lyrics In Telugu
అతడు: గుండిల రైక ధన… గోలిసాతు సీర ధన
నడుముకు బిందున్నధన
నాగ కన్య నడక ధన
ఆగు సీతమ్మో ఓహో
ఆమె: ఉంగరాల జుట్టు వాద
కోల మొకం సిన్నవాడా
గతం అంతా మరిసినావా
మరిసి వెంటా ఓచుడెలా
రాకు రామయ్యో
అతడు: నీ బిందేన సొట్ట కాదు
నీ సెంపాన సొట్ట సూసి
గుండెల ఖలేజా నింపి
గంగాళ గాతమాంతా కలిపి
ఆత్తి సీతమ్మో ఓ…ఓ….
ఆమె: నువ్వంటే బయం కాదు
దారేంట జనము సూడు
కల్లతో కాటేసే జనులు
మాటతో మాటేసే నారులు
వెల్లు రామయ్యో ఓ…ఓ…
అతడు: జనులు ఉంటె భయం ఏలా
నువ్వు నేను ఒక్కటి కాగా
నారులు ఉంటే గుబులు ఎలా
నీలో నేను జతగా లేనా
రాంగు సేతమ్మో ఓ…ఓ…
ఆమె: ఒకటీ అంటే ఒక్కటి కాదు
తొవ్వ పొంటి సిలకాలుండు
రెండు అంటే రెండు కాదు
ఒర్రె పొంటి కొంగలు ఉండు
వద్దు రామయ్యో ఓ..ఓ…
అతడు: సిలకలకు జామ పండ్లు
నీ కాలికి పట్ట గొలుసు
కొంగలకు సేప ఒరుగు
మెడల నకిలిసి మెరుపు
రాంగు సీతమ్మో ఓ…ఓ…
ఆమె: రాతనలా రాసులాద్దు
నీ పట్ట గొలుసులాద్దు
మెడల నకిలేసులోద్దు
సొమ్ములోద్దు సోకులోద్దు
వెల్లు రామయ్యో ఓ…ఓ…
అతడు: మూసి మూసి నవ్వుల దానా
ముందటి కళ్ల బంధమేనా
సెంద్ర వంక మోము దాన
సేతూలూ కట్టేసుడెలా
సేప్పు సేతమ్మో ఓ…ఓ…
ఆమె: మీది కిందాడకట్టు
నాది మిదాడకట్టు
మీ అయ్య ఉరిమి సూత్తే
మా అయ్య రేచ్చిపోయే
పోత్తు కుదరదో ఓయ్…
అతడు: ఇగురాల ముద్దుగుమ్మా
మీ అయ్యకు నచ్చజెప్పూ
ఒంటిగున్న మా అయ్యకు
ఓపికతో సెప్పి జుత్తా
రాంగు సీతమ్మో ఓ…ఓ…
ఆమె: అయ్యవ్వలు ఇన్నా గానీ
ఆడకట్టోల్లు ఇనారోయి
మంది కంట్లే మన్నువాడా
మానలేడవాపిరాయ
వేల్లిపోవయ్యో…ఓ..ఓ.
అతడు: ఒడ్డు మీది గుడ్డి కొంగలు
గునుక దంచుడు మాటలాడు
కట్ట మీది కాకులాన్ని
కల్లిబొల్లి కబుర్లాడీ
ఇడిసిపెట్టమ్మో ఓ…ఓ….
ఆమె: ఓ మాటల మోతేవారి
ఎట్లా జెత్తవో ఇగ మారీ
ఆపవోయి జిత్తుల మారీ
కోరుకున్నా ఏరి కోరీ
జోడి కట్టయ్యో ఓ…ఓ…
అతడు: ఓరుపు నేరూపుతొటీ
మీ వోల్ల గెలసి వస్తి
మారలేని రాజ్యన
మందిని అదిలించి ఒస్తి
రెక్కవట్టామ్మో ఓ…ఓ….
ఆమె: ఉంగరాల జుట్టు వాడా
ఉండలేను నువ్వు లేక
కోల మొఖం సిన్నవాడా
కోట్లటకైనా ఉంటా
జోడి కట్టయ్యో నాతో… జోడికట్టయ్యో ఓ ఓ
జోడి కట్టయ్యో… నాతో జోడి కట్టయ్యో
రంగు సీతమ్మో పాట Info
Cast | Karthik – Lasya, Parshuram Kamballa, Sairaj, Honey |
Lyrics | Direction – Parshuram Nagam |
Singer | Boddu Dilip – Lavanya |
Music | Praveen Kaithoju |
Song Lable & Credit |
No comments yet