LYRIC

Neethone Lyrics by Suresh Banisetti, Music by Pradeep Sagar, Sung by Chinmayee Sripada and Haricharan, Surya Virat | Diya Seetepalli From Vinay Shanmukh Album Song నీతోనే నీతోనే ఉండాలనిపిస్తోంది.

Neethone Lyrics

Neethone Neethone Undaalanipisthondi
Noorellu Nee Kantipaapalaa
Ee Maate Inkosaarandhaamanipisthondi
Vintaava O Chantipaapalaa

నీతోనే నీతోనే ఉండాలనిపిస్తోంది Lyrics

అతడు: నీతోనే నీతోనే ఉండాలనిపిస్తోంది
నూరేళ్ళు నీ కంటిపాపలా
ఈ మాటే ఇంకోసారందామనిపిస్తోంది
వింటావ ఓ చంటిపాపలా

నా అడుగైనా నీతోనే
పరుగైనా నీతోనే
నా ఊపిరి నువ్వే అంటానే
నా కలలన్నీ నీతోనే
కధలన్నీ నీతోనే
కడదాకా కలిసి ఉంటానే

అతడు: ఒకటా రెండా మూడా
ఎన్నో ఎన్నో ఊహల్లోన
నన్నే అందంగా ఊగిస్తున్నావే

ఒకటా రెండా మూడా
లెక్కేలేని రంగుల్లోన
మనసంతా ముంచేస్తున్నావే

అతడు: నీ చూపుల్తో ఈ చీకటంతా
వెలిగించావే సూర్యుడితో
అవసరమే లేనంతగా
నీ నవ్వుల్తో పగలేమో
వెన్నెల కురిపించావే
జాబిల్లే కుళ్ళుకు చచ్చేటంతగా

ఆమె: మాటలతోటే నన్ను మాయే చేస్తావే
కనులే కలిపేసి
కొంటె కలలు తెస్తావులే
పిచ్చనిపించే ప్రేమలో
మత్తు నాలో కూడా నింపేసావే
ఈ ఈ ఈ క్షణమే

అతడు: ఒకటా రెండా మూడా
ఎన్నో ఎన్నో ఊహల్లోన
నన్నే అందంగా ఊగిస్తున్నావే
ఒకటా రెండా మూడా
లెక్కేలేని రంగుల్లోన
మనసంతా ముంచేస్తున్నావే

అతడు: ఒకటవుదామా మనలాంటి
ఇంకో జత లేదంటు
విడదీద్దామన్న విడిపోనంతగా
కలిసుందామా మనలోకమేదో మనదేనంటూ
మన మధ్యకి ఎవరూ రాలేనంతగా

ఆమె: నువు చెప్పినవన్నీ
నా మనసే వింటోంది
కనుకే నీ వెనకే
కొత్త పరుగు తీస్తున్నది
ఇద్దరి ఊపిరి ఒక్కటయ్యాక
ఇంతకుమించిన వరమేముంది
హ హ బావుందీ

అతడు: ఒకటా రెండా మూడా
ఎన్నో ఎన్నో ఊహల్లోన
నన్నే అందంగా ఊగిస్తున్నావే

ఒకటా రెండా మూడా
లెక్కేలేని రంగుల్లోన
మనసంతా ముంచేస్తున్నావే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO