Male: Andhanantha Dhoorana
Merise Sandamama
Epudu Andhamga
Sakkaguntaadhe
Dhoorapu Kondallo
Daagina Nunupentho
Daggarakellaake
Ardhamauthaadhe
Male: Ningike Kummukunnaa
Nallati Mabbulannee
Epudo Okasaari Idipothaaye
Gundeke Kammukunna
Premane Kaarumabbu
Nuvvu Sachhina Koodaa
Entapadathaadhe
మెరిసే సందమామ Lyrics
అతడు: అందనంత దూరాన
మెరిసే సందమామ
ఎపుడు అందంగా
సక్కగుంటాదే
దూరపు కొండల్లో
దాగిన నునుపెంతో
దగ్గరకెళ్ళాకే అర్ధమౌతాదే
అతడు: నింగికే కమ్ముకున్నా
నల్లటి మబ్బులన్నీ
ఎపుడో ఒకసారి ఇడిపోతాయే
గుండెకే కమ్ముకున్న
ప్రేమనే కారుమబ్బు
నువ్వు సచ్చినా కూడా
ఎంటపడతాదే
అతడు: చందమామ చందమామ
నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ
వెన్నెలమ్మా వెన్నెలమ్మా
నా శ్వాసే నువ్వనుకున్నానమ్మా
అతడు: నా మనసే ముక్కలుగా చేసావే
నా ఆశల రెక్కలనే విరిచావే
ఊహలకే ఉరితాడు వేసావే
బ్రతుకంతా చితిలాగా పేర్చావే
అతడు: ప్రేమిస్తూనే నిన్ను ద్వేషిస్తానని
ఇన్నాళ్ళుగా మరి అనుకోలే
కన్నీటిలో నను కూల్చేస్తావని
కలలో కూడా కల గనలేదే
కోరస్: తుఫానే వచ్చినట్టు
ధుమారం రేగినట్టు
ప్రమాదం అంచుమీద
కూర్చున్నానే
నిజంగా రంపమెట్టి
ఒళ్ళంతా కోసినట్టు
నా బాధే తీర్చలేనిదంటున్నానే
అతడు: నన్నే నిలువెల్లా అంటించి
అందులోన చలి కాచుకున్నావా
రోజు నాకింత విషమిచ్చి
అమృతంలా అలవాటు చేశావా
అతడు: ఎందుకు ఎగరేసావో మబ్బుల్లో
ఎందుకు తోసేసావో లోయల్లో
అసలే అర్ధంకాకే శూన్యంలో
చూస్తూ ఉన్నానిలా…
అతడు: అడిగేద్దామంటే ధైర్యం చాలట్లే
వదిలేద్దామంటే వల్లే కావట్లేదే
కోరస్: తుఫానే వచ్చినట్టు
ధుమారం రేగినట్టు
ప్రమాదం అంచుమీద
కూర్చున్నానే
నిజంగా రంపమెట్టి
ఒళ్ళంతా కోసినట్టు
నా బాధే తీర్చలేనిదంటున్నానే
అతడు: నవ్వే కరువైపోయిందే
చిన్ని గుండె చేరువైపోయిందే
దేహం బరువైపోయిందే
లోకమంతా ఇరుకైపోయిందే
అతడు: కూరుకుపోయానులే చీకట్లో
బయటికి రాలేనులే ఇప్పట్లో
కుమిలే నా ప్రాణమే
నిద్దట్లో పోతే బాగుండునే
చద్దామనుకుంటే చావే రావట్లే
బ్రతికుందామంటే దారే దొరకట్లేదే
కోరస్: తుఫానే వచ్చినట్టు
ధుమారం రేగినట్టు
ప్రమాదం అంచుమీద
కూర్చున్నానే
నిజంగా రంపమెట్టి
ఒళ్ళంతా కోసినట్టు
నా బాధే తీర్చలేనిదంటున్నానే
అతడు: ఏడుపొచ్చే నవ్వు వచ్చే
ఒకసారే రెండు తన్నుకొచ్చే
కోపమొచ్చే బాధ వచ్చే
నా మీదే నాకు జాలి వచ్చే
అతడు: నా మనసే ముక్కలుగా చేసావే
నా ఆశల రెక్కలనే విరిచావే
ఊహలకే ఉరితాడు వేసావే
బ్రతుకంతా చితిలాగా పేర్చావే
అతడు: ప్రేమించడానికే ఉన్న మనసిది
నిందించడం ఎలా నేర్పనే
నీ కంటె నీరుని చూడలేకనే
నా కన్నులనే తడిచేసానే
Comments are off this post