LYRIC

Neeli Neelakantuda Lyrics From Mangli Shivaratri Song

Singer: Mangli
Music: Madeen SK
Lyrics:
Kasarla Shyam

Neeli Neelakantuda Lyrics In English

Female: Nalla Nallani Koppuna Sallani Ganganu
Daasukunna NeeliKantuda
Tella Tellaani Sirisiri Ennela Vankanu
Etthukunna Sivashambhudaa

Female: Aa Aa, Ontinindaa Boodidhunna
Kanti Ninda Nippulunna
Andamaina Maalalalli Kondabidda Gowri Thalli
Kori Kori Ninnu Cheri Ardanaari Ayye Vela

Female: Raaraa Shivayya, Aa Aa
Dandaalayyaa Abhishekalayya
OO Oo Oo Maa Lingamayya, Aa Aa
Dandaalayyaa Abhishekalayya

Neeli Neelakantuda Lyrics In Telugu

ఆమె: నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలికంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా

ఆమె: ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న
కంటినిండా నిప్పులున్న
అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి
కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ

ఆమె: రారా శివయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా…. అభిషేకాలయ్యా
ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా అభిషేకాలయ్యా

ఆమె: నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ

ఆమె: మూడు కన్నులవాడ
మూడు శూలాల వాడ
మూడు లోకాలనేలే సాంబయ్యా
కోరస్: మూడు కన్నులవాడ
మూడు శూలాల వాడ
మూడు లోకాలనేలే సాంబయ్యా

ఆమె: మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి
మాగోడు తీర్చుతావు మా అయ్యా
కోరస్: మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి
మాగోడు తీర్చుతావు మా అయ్యా

ఆమె: దోసెడన్ని నీళ్లు చల్లితే
బోలెడంత పొంగుతావు శంకరా
పాలధారాలల్ల పోస్తే
పిల్లాపాపలిస్తవంట ఈశ్వరా

ఆమె: రుద్రుడా వీర భద్రుడా
కాలుడా భక్త లోలుడా
పంచాక్షరాల స్వామి
పంచామృతాల లోన
పంచదార కలిసినట్టు
పంచవయ్యా నీదు ప్రేమ

ఆమె: నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ

ఆమె: సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు
వాయు లింగము నీవు పరమేశా
కోరస్: సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు
వాయు లింగము నీవే పరమేశా

ఆమె: పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు
తేజో లింగము నీవు జగదీశా
కోరస్: పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు
తేజో లింగము నీవే జగదీశా

ఆమె: ఎండికొండల వాసివే నీకు ఏకాదశ రుద్రమే
నందివాహనం ఎక్కిరా
గమకచమకాలు నీకు ఇష్టమే
దేవుడా ఆది దేవుడా అరుణాకోనే నాధుడా

ఆమె: బిచ్చమెత్తే సామి నీవు
అచ్చమైన మనసుతోటి
స్వచ్చమైన జీవితాన్ని
ఇచ్చిపోవా జంగమయ్య

ఆమె: నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా

ఆమె: ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న
కంటినిండా నిప్పులున్న
అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి
కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ

ఆమె: రారా శివయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా…. అభిషేకాలయ్యా
ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా అభిషేకాలయ్యా
దండాలయ్యా అభిషేకాలయ్యా

నీలి నీలకంఠుడా Song

Song Label: Mangli Official

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO