LYRIC
Kapolla Intikada Part 2 Lyrics by Srilatha Yadav, Sung by Kumara Vagdevi, Music by Madeen Sk, Naaga Durga From Folk Song. కాపోల్ల ఇంటికాడ కలిసీ ఆడిన ఆట పడుసోళ్లంత వచ్చి కూడి పాడిన పాట.
Kapolla Intikada Part 2 Lyrics
Female: Kaapolla Intikaada Kalisi Aadina Aata
Padusollantha Vachhi Koodi Paadina Paata
Manchigundera Naa Madhilo Underaa
Entho Manchigunderaa
Baava Manasu Ninderaa
Female: Kaapolla Intikaadaa
Manam Koodi Aadina Aata
Aa Padusu Jantalanni
Koodi Paadina Paata
Female: Manchigundera
Naa Madhilo Underaa
Baava Manchigunderaa
Naa Manasu Ninderaa
కాపోల్ల ఇంటికాడ కలిసీ ఆడిన ఆట Lyrics
ఆమె: కాపోల్ల ఇంటికాడ కలిసీ ఆడిన ఆట
పడుసోళ్లంత వచ్చి కూడి పాడిన పాట
మంచిగుండెరా నా మదిలొ ఉండెరా
ఎంతో మంచిగుండెరా… బావ మనసు నిండెరా
ఆమె: కాపోల్ల ఇంటికాడా
మనం కూడి ఆడిన పాట
ఆ పడుసూ జంటలన్ని
కూడి పాడిన పాట
ఆమె: మంచిగుండెరా
నా మదిలొ ఉండెరా
బావ మంచిగుండెరా
నా మనసు నిండెరా
ఆమె: గొల్లోళ్ళింటికాడ గొర్లా మందలట
గొర్లపాల జున్ను కమ్మలగుంటదని
కొంటిమి కదా మనం తింటిమి కదా
బావ కొంటిమి కదా… మనం తింటిమి కదా
గొల్లోళ్ళింటికాడా, అరె గొర్లా మందలట
గొర్లపాల జున్ను కమ్మలగుంటదని
కొంటిమి కదా మనం తింటిమి కదా
బావ కొంటిమి కదా… మనం తింటిమి కదా
ఆమె: మేరోళ్ళింటికాడ పోతపోసిన రైక
మనసూ పడిన నాకు మంచీగుంటయని
కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి
నాకు కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి
మేరోళ్ళింటికాడా… పోతపోసిన రైకలన్నీ
నీకు మనసూ పడిన నాకు మంచీగుంటయని
కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి
నాకు కుట్టీపిస్తివి… బావ పట్టుకొస్తివి
ఆమె: కుమ్మరోళ్ళ ఇంటికాడ మట్టీ కుండలట
అవ్వే మనకు బోళ్లు ముంతాలైతయని
ఎన్నో సెప్తివి నా ఎదను దోస్తివి
బావ ఎన్నో సెప్తివి… నా ఎదను దోస్తివి
కుమ్మరోళ్ళ ఇంటికాడా, అరె మట్టీ కుండలట
అవ్వే మనకు బోళ్లు ముంతాలైతయని
ఎన్నో సెప్తివి ఇప్పుడేడ పోతివి
బావ ఎన్నో సెప్తివి… నా ఎదను దోస్తివి
ఆమె: ఓ బావో బంగరుకొండ
మనసూలున్న మాట మంచీగిను మరి
నీకే సెప్పుతున్న మనువు జేసుకో
నా మనసునేలుకో
నన్ను మనువు జేసుకో… నా మనసునేలుకో
ఆమె: ఓ బావో బంగరుకొండా
అరె మనసూలున్న మాటా
అరె మంచీగిను మరి
నీకే సెప్పుతున్న మనువు జేసుకో
నా మనసునేలుకో
నన్ను మనువు జేసుకో
నా మనసునేలుకో
Comments are off this post