LYRIC
Kapolla Intikada Folk Song Part 3 Lyrics by Srilatha Yadav, Music: Madeen Sk, Singer: Kumara Vagdevi, From Telangana Folk Song. గౌండ్లోల్లింటి కాడ తాటి ముంజలట తిన్నాకొద్ది మరి తీపి దొరుకునట.
Kapolla Intikada Folk Song
కాపోల్ల ఇంటికాడ పార్ట్ 3 Song
Kapolla Intikada Part 3 Lyrics
గౌండ్లోల్లింటి కాడ తాటి ముంజలట
తిన్నాకొద్ది మరి తీపి దొరుకునట
కూడి పోదమా, మనం తిని వద్దమా
బావ కూడి పోదమా, ముంజలన్ని తిందమా
గౌండ్లోల్లింటి కాడా, అబ్బ తాటి ముంజలట
ఎంత తిన్నాగాని మరి తనివి తీరదట
కూడి పోదమా, మనం తిని వద్దమా
బావ కూడి పోదమా, ముంజలన్ని తిందమా
పిట్టలోల్ల ఇంటికాడ పట్టుతేనెలట
పుట్లకొద్ది తేనె పట్టుకొస్తరట
పోయి వద్దమా బావ తేనె తెద్దమా
మనం పోయి వద్దమా తేనె పట్టుకొద్దమా
పిట్టలోల్ల ఇంటికాడా
అహా, పట్టిన తేనెనంతా
వాళ్ళు మంచీ మనుసుతో పంచీ పెడుతరట
పోయి వద్దమా మనం తెచ్చుకుందమా
బావ పోయి వద్దమా తేనె పట్టుకొద్దమా
ఎరుకలోళ్ల ఇంటికాడ అల్లిన గంపలట
అవ్వే మనకు పూల గంపాలైతయట
కూడి పోదమా, జోడి గంప తెద్దమా
బావ కూడి పోదమా, జోడి గంప తెద్దమా
ఎరుకలోళ్ల ఇంటికాడ, అరె అల్లిన గంపలట
ఇగ అవ్వే మనకు పూల గంపాలైతయట
కూడి పోదమా, జోడి గంప తెద్దమా
బావ కూడి పోదమా, జోడి గంప తెద్దమా
బైండ్లోల్ల ఇంటికాడ భారీ పూజలట
ఆరుబయట పట్నాలు ఏస్తరట
కూడి పోదమా, బావ సూడపోదమా
మనం కూడి పోదమా, మొక్కుకొని వద్ధమా
బైండ్లోల్ల ఇంటికాడా, అమ్మవారి పూజలట
ఆ బైండ్ల రాజులే గొప్పగ జేస్తరట
కూడి పోదమా, బావ సూడపోదమా
మనం కూడి పోదమా, మొక్కుకొని వద్ధమా
తుర్కోళ్లింటికాడ భీమండి సెంటులంట
మనసూకొద్దీ మరి జల్లుకుంటరట
పోయి వస్తవా, సెంటు మనకు తెస్తవా
బావ పోయి వస్తవా, సెంటు మనకు తెస్తవా
తుర్కోళ్లింటికాడా, ఆ భీమండి సెంటులటా
మనసూకొద్ధి మీద సల్లుకుంటరట
పోయి వస్తవా, సెంటు మనకు తెస్తవా
బావ పోయి వస్తవా, సెంటు మనకు తెస్తవా
Comments are off this post