LYRIC

Sirivennela Female Version Lyrics by Sirivennela Seetharama Sastry, Singers: Chaitra Ambadipudi, Anurag Kulkarni, Music: Mickey J Meyer, From Shyam Singha Roy Telugu Movie Song. నెల రాజుని. ఇల రాణిని. కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా.(Nani, Sai Pallavi)

Sirivennela Female Version Lyrics

Female: Dum Daka Dum Daka
Nela Raajuni Ila Ranini
Kalipindi Kadaa Sirivennela
Dhoorama Dhooramaa
Teeramai Cheruma

Female: Nadi Raathirilo Theralu Therachinadhi
Niddhuralo Magatha
Marachi Udayinchinadhaa
Kulukuloluku Cheli Modati Kalaa

Female: Oo, Chaangure Inthatidaa Naa Siri
Annadi Ee Sharadha Raathiri
Milamila Cheli Kannula
Thana Kalalanu Kanugoni
Achheruvuna Murisi

Female: Ayyaho Enthatidhee Sundari
Evvaru Raaru Kadhaa Thana Sari
Srushtike Addamu Choopaga Puttinadhemo
Naari Sukumari
Idhi Ningiki Nelaki Jarigina Parichayame

Female:  Idilaa Ani
Evaraina Choopaneldhu Kantiki
Adhelaago Thanakainaa
Thochaneledhu Maataki

Female: Ipudipude Manasaina
Repu Dhorikindhi Choopuki
Katha Kadhile Varasanaa
Thama Edhalem Thadisinaa
Gatha Janmala Podavuna
Daachina Dhaahamu
Ipude Veeriki Parichayamaa

Female:  Thana Navvulalo Thaluku Thaluku
Thana Chempalalo Chamaku Chamaku
Thana Muvvalalo Jhanaku Jhanaku
Sarikottha Kalaa

సిరివెన్నెలా Lyrics

కోరస్: డుం డక డుం డక
డుం డక డుం డక
ఆమె: నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెలా
దూరమా దూరమా తీరమై చేరుమా

ఆమె: నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరిచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా

ఆమె: ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి

ఆమె: అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్ఠికే అద్దము చూపగ
పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

ఆమె: ఇదిలా అని
ఎవరైనా చూపనేలేదు కంటికీ
అదెలాగో తనకైనా
తోచనేలేదు మాటకి

ఆమె: ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి
కథ కదిలే వరసనా
తమ ఎదలేం తడిసినా
గత జన్మల పొడవున
దాచిన దాహము
ఇపుడే వీరికి పరిచయమా

ఆమె: తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
కోరస్: డుం డక డుం డక
డుం డక డుం డక

సిరివెన్నెల ఫిమేల్ Song Info
Song Label: Saregama Telugu 

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO