LYRIC
Raleva Bangaram Lyrics and Music by Rajender Konda, Sung by Divya Malika, From Telangana Love Failure Folk Female Song. వదిలేసావా నన్నిలా. ప్రేమించినందుకు ప్రాణంగా. కాదంటావా నన్నిలా…
Raleva Bangaram Lyrics
రాలేవ బంగారూ Lyrics
ఆమె: వదిలేసావా నన్నిలా
ప్రేమించినందుకు ప్రాణంగా
కాదంటావా నన్నిలా
నా ప్రాణమే నువ్వనుకున్నగా
ఆమె: నా గుండెలోని ఆశని
నువ్వే కాలరాసి పోతివి
నా మనసులున్న మాటని
నీకే చెప్పాలని ఉన్నది
ఒక్కసారి కంటిముందు కానరావ
నా గుండె ఆగుతున్నది
ఆమె: నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారూ
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారు
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
ఆమె: మనసులున్న మాటను
ఈ ముళ్ళ బాటలో
నీకు సెప్పలేకనే సెయ్యి జారుతున్నాను
గుండెలోని బాధని
నీ గురుతుగ నేనే
పదిలంగ దాసుకున్నా నిను మరువలేకనే
ఆమె: నిన్ను నేను సూడాలని
మాటలెన్నొ సెప్పాలని
సెప్పలేక పోతున్నా
నువ్వులేని నీ సిన్నదాన్ని
ఆమె: నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారూ
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారు
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
ఆమె: నువ్వస్తవేమని ఎదురుచూస్తు ఉంటిని
నా ఎదలో నిన్నెప్పుడు నే తలసుకుంటిని
నువు రాకపోయినా నీ జ్ఞాపకాలతో
ఎన్నిరోజులని గడపాలో నాకు తెలియదే
ఆమె: పాపమేమి నే జేసినానో
పాపకారి దేవుడు నన్నే
నిన్ను జూడకుండానే
ఉంచినాడు దూరంగానే
ఆమె: నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారూ
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారు
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
Comments are off this post