LYRIC

Palleturilone Sadhyam Lyrics

Singers: Kailash Kher
Music: Sada Chandra
Lyrics: Chandra Bose

Palleturilone Sadhyam Lyrics

Male: Nela Thalliki Tholisooru Bidda Palleturu
Illanni Chukkaluga Vesina Pedda Mugge Palleturu
Mattini Muddhaade Paadaalu ||2||
Pravahinche Chote Palletooru

Male: LeLe LeLe Lemmantu
Sooryunni Niddara Lepatam
Lechi Kootha Pettamantu
Kodipunjuni Thodara Pettadam

Male: Peda Neellatho Aluku Challadam
Nallaboggutho Pallu Thomadam
Gilakabaavilo Neellu Thodatam
Matti Kundalo Vanta Vandatam

Male: Prakruthi Maatha Odilo, Oo Oo OoOo
Prakruthi Maatha Odilo
Nithyam Pasipaapalugaa Brathakadam

Chorus: Palleturilone Sadhyam
Idhi Palletoorilone Saadhyam
Palleturilone Sadhyam
Idhi Palletoorilone Saadhyam ||2||

Palleturilone Sadhyam Lyrics

ఆతడు: నేల తల్లికి తొలిసూరు బిడ్డ, పల్లెటూరు
ఇళ్ళన్ని చుక్కలుగా వేసిన… పెద్ద ముగ్గే పల్లెటూరు
మట్టిని ముద్దాడే పాదాలు
మట్టిని ముద్దాడే పాదాలు
ప్రవహించే చోటే పల్లెటూరు

ఆతడు: లేలే లేలే లెమ్మంటూ
సూర్యుణ్ణి నిద్దర లేపటం
లేచి కూత పెట్టమంటూ
కోడిపుంజుని తొందర పెట్టడం

ఆతడు: పేడ నీళ్లతో… అలుకు చల్లడం
నల్లబొగ్గుతో పళ్ళు తోమడం
గిలకబావిలో… నీళ్లు తోడటం
మట్టి కుండలో… వంట వండటం

ఆతడు: ప్రకృతి మాత ఒడిలో, ఓ ఓఓ ఓ
ప్రకృతి మాత ఒడిలో
నిత్యం పసిపాపలుగా బ్రతకడం

కోరస్: పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం ||2||

ఆతడు: పంచాయితీలో ఒక్కడి మాటకి
అందరు కట్టుబడి ఉండటం
పక్కింటి కూరలు… ఈ ఇంటి అన్నంతో
అనుబంధాన్నే కలపటం..

ఆతడు: ఎవరో తెలియని… అతిధుల కోసం
ఇంటికి అరుగులు కట్టడం
చీమలు తినడం కోసం… బియ్యపిండితో
ముగ్గులు వెయ్యడం

ఆతడు: తురక దూదేకుల పీరిలను ఎల్లయ్యే
ఎత్తుకొని తిరగటం
శ్రీరామ నవమి వడపప్పుని చాంద్ పాషా
అందరికి పంచటం

ఆతడు: ప్రకృతి మాత గుడిలో, ఓఓ ఓఓ
ప్రకృతి మాత గుడిలో
నిత్యం భక్తులుగా బ్రతికెయ్యటం

కోరస్: పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం

అతడు: గోచీకట్టిన కాసేపోసిన
అశ్లీలత ఆనింపించదు
పనిపాటల్లో తిట్లు దొర్లిన
అసభ్యంగా వినిపించదు

ఆతడు: చెంబు చేట బయటే ఉన్నా
దొంగలు రారని నమ్మకం
విత్తులు నాగలి సిద్ధం చేసి
వానోస్తుందని విశ్వాసం

ఆతడు: పురుగు పుట్రతో కలిసుంటూ
చావొస్తే రానివ్వను ధైర్యం ||2||
ప్రకృతి మాత బడిలో, ఓ ఓఓ ఓ
విద్యార్థులు గా బ్రతకటం

కోరస్: పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం

కోరస్: పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం

పల్లెటూరిలోనే సాధ్యం Song

Song Label & Source: Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO